30 నిమిషాలపాటు ఉరితాడుకు వేలాడిన నిర్భయ దోషులు

నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన నలుగురు దోషులు అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌లకు శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. అయితే వారిని ఉరి తీసిన తర్వాత.. వారి శరీరాలను ఉరితాడుకు 30 నిమిషాల పాటు అలాగే ఉంచారు. చనిపోయిన వారిని అలాగే ఉంచడమేంటని అనుమానం రావచ్చు. అలా ఉంచడానికి కారణమేంటంటే.. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీసిన వారిని వెంటనే దించకుండా 30 నిమిషాల పాటు వేలాడదీస్తారు. ఆ కారణంచేతనే దోషుల శరీరాలను అలా ఉంచారు.

కాగా.. దోషులు ఉరితీయడానికి ముందు పోలీసులతో కోపంగా ప్రవర్తించారని అధికారులు తెలిపారు. దోషుల ముఖాలను నల్లని బట్టతో కప్పి ఉరితాడు వద్దకు తీసుకెళ్లారు. తలారీ పవన్ వారి మెడకు తాడు బిగించాడు. జైలు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు తలారీ దోషులను ఉరితీశాడు. ఆ తర్వాత దోషులంతా చనిపోయినట్లు డాక్టర్ నిర్దారించిన తర్వాత వారి మృతదేహాలను దించారు. పోలీసు భద్రత మధ్య దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను వారివారి కుటుంబసభ్యులకు అందజేస్తారు.

నిర్భయ కేసు 2012లో నమోదయింది. 2012 డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థినిని కదిలే బస్సులో దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒక దోషి ఆత్మహత్య చేసుకోగా.. మరోకరిని మైనర్ కావడంతో విడుదల చేశారు. మిగతా నలుగురికి ఈ రోజు ఉరిశిక్ష అమలు చేశారు.

For More News..

ఉరికి ముందు నిర్భయ దోషులు ఏంచేశారంటే..

ఉగ్రవాదుల దాడిలో 29 మంది సైనికులు మృతి

నిర్భయ కేసు: దోషుల్లో అతను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు

Latest Updates