నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి

నిర్భయ దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు ఇవాళ (సోమవారం) మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయాలంటూ తీర్పునిచ్చింది. నలుగురినీ ఒకే సారి ఉరి తీయాలని తీహార్ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

నిర్భయ దోషులకు పటియాల కోర్టు మూడో సారి డెత్ వారెంట్ జారీ చేసింది. మొదటి డెత్ వారెంట్ జనవరి 22, రెండో డెత్ వారెంట్ ఫిబ్రవరి 1న జారీ చేసింది. ఇప్పుడు లేటెస్టుగా మూడో డెత్ వారెంట్ మార్చి 3గా కోర్టు తీర్పు ఇచ్చింది.

మరోవైపు కోర్టు తీర్పుతో సంతోషం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశాదేవి.

Latest Updates