నిర్భయ దోషులకు ఉరే సరి

నిర్భయ దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ కొట్టివేత
నిర్భయ కేసు దోషులలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌పై వాదనలు విన్న ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. అక్షయ్ వేసిన రివ్యూను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. దోషికి సమీక్ష కోరే హక్కులేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దోషులపై దయ అక్కర్లేదని ధర్మాసనం భావించింది. గతంలో ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం.. తాజాగా అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను కూడా కొట్టేసింది. నిర్భయ దోషులకు ఉరే సరి అని సుప్రీంకోర్టు తేల్చింది. నిందితులు క్షమించరాని నేరం చేశారని కోర్టు భావించింది. 2017లో పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పు సరిఅయినదేనని కోర్టు భావించింది.

మధ్యాహ్నం 2 గంటలకు పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ కేసుపై విచారణ జరగనుంది. ఇప్పటికే నిర్బయ తల్లిదండ్రులు పటియాలా కోర్టు ఆవరణకు చేరుకున్నారు. ఆ విచారణలో వీరికి డెత్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుకానుంది. ఈ తీర్పు కాపీపై జస్టీస్ భానుమతి సంతకం చేశారు.

కాగా.. అక్షయ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. క్షమాభిక్ష పిటిషన్‌కు మూడు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంను కోరినట్లు ఆయన తెలిపారు. క్షమాభిక్ష పిటిషన్‌కు కేవలం వారం చాలని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.

For More News..

అదే తరహాలో 9 హత్యలు చేసిన దిశ నిందితులు?
సీఎం కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు !!
పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Latest Updates