‘విడాకులు కావాలి’ నిర్భయ దోషి భార్య పిటిషన్

ఉరిశిక్ష అమలు  తేది దగ్గరపడుతుండడంతో ఎలాగైనా శిక్షను తప్పించుకోవాలని నిర్భయ దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్..  అత్యాచార ఘటన జరిగిన రోజు(డిసెంబర్ 16, 2012)న తానసలు ఢిల్లీలోనే లేనని కోర్టులో పిటిషన్ వేస్తే… మరొక దోషి భార్య తన భర్త నుంచి విడాకులు కావాలంటూ ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది.

దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్  భార్య పునీత దేవి.. ‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండదల్చుకోలేదు’ అని విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది.

అయితే న్యాయనిపుణులు ఆమె పిటిషన్‌ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన ఇన్నాళ్ల తర్వాత భర్త నుంచి విడాకులు కావాలని పిటిషన్‌ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Latest Updates