దోషులను క్షమించమనడానికి ఆమె ఎవరు?: నిర్భయ తల్లి

సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నిర్భయ దోషులను క్షమించాలంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను నిర్భయ తల్లి ఆశాదేవి తప్పుబట్టారు. ఆశాదేవి బాధను అర్థం చేసుకుంటామని, అయితే రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళినిని సోనియాగాంధీ ఎలాగైతే క్షమించారో.. అలాగే నిర్భయ తల్లి కూడా దోషులను క్షమించాలని ఆమె సూచించారు.

ఒక సీనియర్ లాయర్ అయిన ఇందిరా జైసింగ్ ఇలాంటి కామెంట్స్ చేయడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. దోషులను క్షమించాలన్న సలహా ఎందుకివ్వాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. తమకు సలహా ఇవ్వడానికి ఇందిరా జైసింగ్ ఎవరన్నారు. దేశం మొత్తం నిర్భయ దోషులను ఉరి తీయాలని కోరుకుంటోందని ఆమె అన్నారు. జైసింగ్ లాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదని నిర్భయ తల్లి ఆరోపించారు. తాను ఇందిరా జైసింగ్‌ను చాలా సార్లు కలిశానని, కలిసినప్పుడల్లా యోగక్షేమాలు అడిగేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అటువంటి జైసింగ్ ఇప్పుడు దోషుల తరపున మాట్లాడటం ఏంటని ఆమె ప్రశ్నించారు.

అటు నిర్భయ దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్‌కు ఢిల్లీ బార్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. ఏపీ సింగ్ హైకోర్టు ముందుకు రాకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో.. రెండు వారాల్లో సరైన రిప్లే ఇవ్వాలని ఆదేశించింది. ఏపీసింగ్‌పై చర్యలు తీసుకోవడంతో పాటూ… రూ. 25 వేల ఫైన్ విధించాలని ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్‌కు సూచించింది.

For More News..

రేపటినుంచి షిరిడీ నిరవధిక బంద్

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

Latest Updates