ఉరితీసేందుకు పవన్ గుప్తాను రెడీ చేస్తున్నారు

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వేసేందుకు తీహార్ జైల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న నలుగురు నిందితులకు ఈ నెలలో ఉరితీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ నలుగురు నిందితుల్ని ఒకేసారి ఉరితీస్తారా..? ఒక్కొక్కరిని ఉరితీస్తారా..? లేదంటే విడివిడిగా ఉరితీస్తారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ నిందితుల్ని ఒక్కొక్కరిని తీస్తారని తెలుస్తోంది. నలుగురి నిందితుల్లో తొలిసారిగా పవన్ గుప్తాను ఉరితీయనున్నారు.

ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిర్భయ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న పవన్ గుప్తాను మండోలి జైల్ నుండి తీహార్ జైలుకు తరలించారు. మరికొద్దిరోజుల్లో పవన్ ను ఉరితీస్తున్న నేపథ్యంలో తీహార్ జైల్ అధికారులు  ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates