సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి

నిర్భయ రేప్ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో నిర్భయ  తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరారు. శిక్ష అమలులో ఆలస్యం కావడంపై పిటిషన్ వేస్తామని నిర్భయ తల్లి తరఫు లాయర్ చెప్పారు. దీంతో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న ఈ పిటిషన్లను విచారించనుంది. అక్షయ్‌ పిటిషన్‌పై ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపింది. తనకు వేసిన మరణశిక్ష తీర్పును మరోసారి సమీక్షించాలని అక్షయ్‌ తన పిటిషన్‌లో కోరాడు.

Latest Updates