నిర్మల ప్రసంగంలో భారత్ మాత, సాగరమాల, చాణక్య సూత్ర

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ.. మోడీ ప్రభుత్వ పథకాలను, కేంద్రానికి ఆదర్శంగా నిలిచిన సూత్రాలను వివరించారు నిర్మల సీతారామన్. చాణక్య నీతి సూత్రాలను అనుసరించి కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. చాణక్యుడు ఏం చెప్పాడో ఆ మాటలను చదివి వినిపించారు. కార్యసాధకులు నిర్దిష్టమైన లక్ష్యాలతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు అని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా లక్ష్యాలను సాధించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేస్తోందని వివరించారు.

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు లేకుండా చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి నిర్మల. భారత్ మాత, సాగర్ మాల, ఉడాన్(UDAN) పథకాలు అందుకే తీసుకొచ్చామన్నారు. ఈ పథకాలు… గ్రామాలు, నగరాల మధ్య ప్రగతి వంతెనలా పనిచేయబోతున్నాయని వివరించారు. ట్రాన్స్ ప్రోర్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఈ స్కీమ్స్ ఇంప్రూవ్ చేస్తాయన్నారు.

Latest Updates