మిషన్ ఫర్ డికేడ్.. నిర్మల చెప్పిన 10 సూత్రాలు

నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని లోక్ సభలో చెప్పారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఓ దశాబ్దకాలంలో.. నిర్మాణాత్మక విధానాలతో పథకాలను అమలుచేయాలని… అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. విజన్ ఫర్ డికేడ్ పేరుతో ప్రగతికి పదిసూత్రాలను ఆమె వివరించారు.

  1. సామాజిక మౌలిక సదుపాయాల కల్పన
  2. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి డిజిటల్ ఇండియా
  3. కాలుష్య రహిత భారత్ – పచ్చని నేల.. నీలాకాశంతో ఉంచేలా లక్ష్యం
  4. ఉద్యోగాల కల్పన – మేకిన్ ఇండియా, స్టార్టప్స్ ప్రోత్సాహం, రక్షణ భాగాల తయారీ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీస్, మెడికల్ డివైజెస్ తయారీ
  5. నీళ్లు- నీళ్ల సంరక్షణ, నిర్వహణ – స్వచ్ఛమైన నదులు, బ్లూ ఎకానమీ
  6. స్పేస్ ప్రోగ్రామ్స్ – గగన్ యాన్, చంద్రయాన్, శాటిలైట్ ప్రోగ్రామ్స్
  7. వ్యవసాయంలో స్వయం సమృద్ధి- ఆహార ధాన్యాల ఎగుమతి, తృణధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు
  8. ఆరోగ్యవంతమైన సమాజం- ఆయుష్మాన్ భారత్, మహిళా-శిశువులకు పౌష్టికరమైన ఆహారం,
  9. పౌరుల భద్రత, రక్షణ
  10. మినిమం గవర్నమెంట్.. మ్యాక్జిమమ్ గవర్నెన్స్

Latest Updates