జపాన్‌ G-20 సదస్సుకు నిర్మాలా సీతారామన్‌

జూన్‌ 8న జపాన్‌లోని ఫకువొకా నగరంలో ప్రారంభం కానున్న G-20 సదస్సులో భారత్‌ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. ఈ సదస్సులో దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ గవర్నర్ల సమావేశం కానున్నారు. అయితే గతవారం బాధ్యతలు స్వీకరించిన సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన. ఆమెతో పాటు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, మౌలిక రంగం, పన్నుల అంశాల్లో నెలకొన్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొన్ని దేశాలు వారి వాణిజ్య విధానాల్లో అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి అంర్జాతీయ వ్యాపారంపై దాని ప్రభావం పై కూడా చర్చించనున్నారు.

 

Latest Updates