త్వరలో జలమార్గ్ వికాస్ పథకం

Nirmala Sitharaman presents Union Budget 2019: Jala Vikas marg

దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అనుమతిచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లకు పెరగనుందని చెప్పారు.-విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని, దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ఈపథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు.

Latest Updates