‘నిశ్శబ్దం’: అనుష్క మూగ సైగలు!

జేజమ్మ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా టీజర్

వెండితెర జేజమ్మ బర్త్ డే సందర్భంగా కొత్త లుక్‌తో అభిమానుల ముందుకొచ్చింది. మూకీ సైగలతో ‘నిశ్శబ్దం’గా స్టన్ చేస్తోంది. సైరా సినిమాలో అలా మెరిసి వెళ్లిపోయిన అనుష్క మెయిన్ రోల్‌గా భారీ మల్టీ లింగ్వల్ సినిమాతో రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రేక్షకుల్ని క్షణక్షణం ఉత్కంఠతో కట్టేయబోతోంది.

మాటలు రాని ఆర్టిస్ట్.. భయపడుతూ సైగలు చేస్తున్న అనుష్క

‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అనుష్క బర్త్ డే (నవంబరు 7) గిఫ్ట్‌గా ఒకరోజు ముందుగా బుధవారం రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. సస్పెన్స్ రేపే బ్యాగ్ రౌండ్ మ్యూజిక్‌తో ఉత్కంఠ కలిగించేలా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఈ సినిమాలో అనుష్కకు మాటలు రాని ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. భయం భయంగా సైగలు చేస్తూ.. ఏదో చెప్పాలని ట్రై చేస్తూ కనిపించింది టీజర్లో. ఆనందంగా ఉండే మాటలురాని ఆర్టిస్ జీవితాన్ని ఓ విహారయాత్ర.. పీడకలగా ఎలా మార్చిందన్నదే కథాంశం.

ఐదు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ

పూపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. తెలుగులో మంచు విష్ణు, తాప్సీలతో వస్తాడు నా రాజు మూవీ తీసిన హేమంత్ మధుకర్.. ‘నిశ్శబ్దం’  డైరెక్టర్. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. అనుష్క, మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి ఐదు భాషల్లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు షూట్ చేస్తున్నారు. ఇంగ్లిష్ వర్షన్‌కు సైలెన్స్ అని టైటిల్ పెట్టారు. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది.

Latest Updates