నీతా అంబానీకి అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త, నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. అత్యున్నత స్థాయి బోర్డు సమావేశంలో 57 ఏళ్ల నీతా అంబానీని గౌరవ సభ్యురాలిగా  ఎన్నుకున్నట్లు మ్యూజియం  ఛైర్మన్‌ డేనియల్‌ బ్రాడ్‌స్కీ తెలిపారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ నీతా అంబానీ.

 

Latest Updates