ఇంటెలిజెంట్ ప్లేయర్‌‌‌‌?

ఎంత గ్యాప్‌‌ వచ్చిందని కాదు, మళ్లీ ఎలాంటి ఎంట్రీ ఇచ్చామన్నది ముఖ్యం అన్నట్టుగా ఉంది నితిన్ తీరు. ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించాడు. అది కూడా ఒకదానితో ఒకదానికి సంబంధం లేని సబ్జెక్ట్స్‌‌. ముగ్గురు మంచి డైరెక్టర్స్‌‌. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌‌లో ‘భీష్మ’ చేస్తూ బిజీగా ఉన్నాడు. దానితో పాటు ‘రంగ్‌‌దే’ అంటూ రానున్నాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌‌లో నటిస్తాడు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. ఇందులో నితిన్‌‌ ఒక చెస్‌‌ ప్లేయర్‌‌‌‌గా కనిపిస్తాడట. దాంతో దీనికి టైటిల్ కూడా ‘చదరంగం’ అని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కూల్‌‌ మూవీ అయితే కాదట. మంచి క్రైమ్ సస్పెన్స్‌‌ థ్రిల్లర్ అట. చంద్రశేఖర్‌‌‌‌ యేలేటి గురించి చెప్పమంటే ఎవరైనా ఆయన స్క్రీన్‌‌ ప్లే గురించే మాట్లాడతారు. టాప్ డైరెక్టర్లు కూడా ఆయన స్క్రీన్‌‌ ప్లే రాసే విధానాన్ని పొగుడుతూ ఉంటారు. అలాంటివాడు హీరోని చెస్‌‌ ప్లేయర్‌‌‌‌ని చేస్తున్నాడటంటే కచ్చితంగా తెలివైన ఆట ఆడిస్తాడన్నమాట. కాకపోతే దీన్ని ఇంతవరకూ అధికారింగా ఎవరూ కన్‌‌ఫర్మ్ చేయలేదు. నిజమే అయితే మాత్రం ఇంటెలిజెంట్ ప్లేయర్‌‌‌‌గా నితిన్ ఎలా ఉంటాడో చూడాలి.

Latest Updates