నిత్యానంద పాస్‌పోర్ట్ క్యాన్సిల్: విదేశాంగ శాఖ

నిత్యానంద అనేక కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న అతడు ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. భారత ప్రభుత్వం అతడి పాస్‌పోర్టు క్యాన్సిల్ చేసిందని, కొత్త పాస్‌పోర్టు కోసం అప్లికేషన్ పెట్టుకోగా.. దాన్ని రిజెక్ట్ చేశామని వివరించారు. విదేశాల్లో ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేశామని, అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని అన్నారు రవీశ్.

మరోవైపు రేప్, చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పారిపోయి, సొంత దేశాన్నే స్థాపించాడని వార్తలు వస్తున్నాయి. ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిని కొనుగోలు చేసి సొంత రాజ్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

నిత్యానంద దేశం విడిచి పారిపోయినట్లుగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్. ఎటుంటి ఏజెన్సీ నుంచి తమకు సమాచారం లేకుండా మీడియాలో వస్తున్న వార్తపై సుమోటోగా తీసుకోలేమన్నారు.

MORE NEWS:

కైలాస దేశం: రాజు, దేవుడు నిత్యానంద.. ప్రధాని ఓ కోలీవుడ్ నటి!

ఆయనా ఓ ఫ్యామిలీ మ్యానే: ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ భార్య

Latest Updates