నీతి ఆయోగ్ స్టాఫర్ కు కరోనా

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ లో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆఫీస్ లో సదరు ఎంప్లాయీ పని చేసే మూడో ఫ్లోర్ ను సీల్ చేసిన అధికారులు.. శానిటైజ్ పనులను కొనసాగిస్తున్నారు. గత వారం మొదట్లో విదేశాంగ వ్యవహారాల శాఖలో పని చేసే ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్ గా వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు మినిస్ట్రీకి సంబంధించిన సెంట్రల్ యూరోప్ (సీఈ) డివిజన్ లో, మరొకరు లా డివిజన్ లో లీగల్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అప్రమత్తమైన మినిస్ట్రీ ప్రొటోకాల్ ప్రకారం సీఈ డివిజన్ లోని అందరు ఉద్యోగులను సెల్ఫ్ క్వారంటైన్ లో 14 రోజుల పాటు ఉంటూ.. ఇళ్ల నుంచే పని చేయాలని ఇంటర్నల్ గా ఈమెయిల్ చేసిందని సమాచారం. కాగా, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ డీఎంసీ) లో పని చేసే ఓ శానిటైజేషన్ ఎంప్లాయీ కరోనాతో చనిపోయిన ఘటన ఆదివారం జరిగింది.

Latest Updates