రూల్స్ పాటించే వారికి చలాన్లంటే భయం ఎందుకు?

దేశ వ్యాప్తంగా అమలైన మోటార్ వాహన చట్టాన్ని సమర్థించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అధిక చలాన్లు విధిస్తే భయంతో ఖచ్చితంగా రూల్స్ పాటిస్తారని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. చట్టం పట్ల భయం కానీ, గౌరవం కానీ ఉండాలన్నారు. రూల్స్ పాటించే వారు చలాన్ల గురించి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన బాధిత కుటుంబాలను  అడిగి చూస్తే అధిక చలాన్లపై అసలైన సమాధానం వస్తుందన్నారు.  ఎక్కువ చలాన్లు విధించకుంటే ప్రజలు భయపడరని అన్నారు. రూల్స్ పాటిస్తే మన రహాదారులు కూడా విదేశీ రహాదారులు మాదిరిగా తయారవుతాయన్నారు.

Latest Updates