ఉగ్రవాదం తరిమికొడదాం : నిజాం కాలేజీ స్టూడెంట్స్ ర్యాలీ

హైదరాబాద్ : దేశం నుండి ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలని నినదిస్తూ నిజాం కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు హైద్రాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ నిజాం కాలేజ్ నుండి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ర్యాలీ లో కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రాథోడ్ తో పాటు, అధ్యాపకులు, విద్యార్థులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని యావత్ భారత జాతి ఖండిస్తుందని… ఉద్రవాదుల దుశ్చర్యలను ప్రతిఒక్కరు వ్యతిరేకించాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపంగా మౌనం పాటించారు.

Latest Updates