నిజామాబాద్ లో పోలింగ్ పై అనుమానాలు: ధర్మపురి అరవింద్

నిజాబాద్ లో పోలింగ్ శాతం పెరగడంపై  తమకు అనుమానాలున్నాయన్నారు  బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్.  ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసిన అంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున పోలింగ్ శాతం పెరగడంపై సీఈవోతో చర్చించామన్నారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఏవైనా సమస్య వస్తే ఆ ఈవీఎం మిషన్ ను మళ్లీ కౌంట్ చేయమని  కోరామన్నారు.  48 గంటల తరువాత ఉపయోగం లేని ఈవీఎంలు ఎందుకు బయట ఉన్నాయో  చెప్పాలని డిమాండ్ చేశామని చెప్పారు. వీటి అన్నింటిపై ఆర్టీఐ ద్వారా వివరాలు అందిస్తామని రజత్ కుమార్  తమతో చెప్పారని  స్పష్టం చేశారు.

Latest Updates