ఆర్మూర్ సీఐని సస్పెండ్ చేయాల్సిందే..

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ సీఐ రాఘవేందర్‌‌ను సస్పెండ్ చేయాలని 63వ జాతీయ రహదారిపై మహిళ సంఘాలు రాస్తారోకోకు దిగాయి. మమత అనే యువతిని ప్రేమించి మోసం చేసిన విషయంలో పోలీస్ స్టేషన్‌‌లో మాట్లాడదామని పిలిచి అసభ్యకర పదజాలంతో సీఐ దూషించాడని మహిళలు ఆందోళనకు దిగారు. సీఐ రాఘవేందర్‌‌ను వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.

Latest Updates