హైకోర్టును ఆశ్రయించిన నిజామాబాద్ రైతులు

Nizamabad Farmers files Lunch Motion petition in High Court

నిజామాబాద్ ఎంపీ ఎన్నికపై ఆ జిల్లా నుంచి పోటీచేస్తున్న178 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తాము ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లోక్ సభ ఎన్నికను వాయిదా వేయాలని, ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ తో పొలింగ్ జరపాలని వారు కోర్టును కోరారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పిటిషన్  విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Latest Updates