ECకి ఫిర్యాదు చేయనున్న నిజామాబాద్ రైతులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన నిజామాబాద్‌ పసుపు రైతులు ఢిల్లీ చేరుకున్నారు. మొత్తం 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 24 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఒక్క రైతు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో వారణాసి ఎన్నికల రిటర్నింగ్‌  అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ చేరుకున్న రైతులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

 

Latest Updates