ఆశ్రమంలో కూతురిని బంధించారంటూ పేరెంట్స్ ఫిర్యాదు

ఢిల్లీ: తమ కూతురిని ఓ ఆధ్యాత్మిక ఆశ్రమంలో  బంధిచారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తల్లిదండ్రులు. నిజామాబాద్ కు చెందిన మీనవతి, రాంరెడ్డి అనే దంపతులు తమ కూతురిని ఢిల్లీకి చెందిన ఓ ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్ బంధించాడని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వీరేంద్రపై అత్యాచారంతో పాటు పలు కేసులు నమోదైనట్లు పిటీషన్ లో తెలిపారు. తమ కూతురిపై డ్రగ్స్ ప్రయోగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసును విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు… కేంద్రానికి, ఢిల్లీ  ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది ప్రధాన న్యాయమూర్తి బెంచ్. పిటిషన్ పై రెండు వారాలలో స్పందించాలని ఆదేశించింది కోర్ట్. కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదావేసింది.

Latest Updates