11నే నిజామాబాద్ పోలింగ్

హైదరాబాద్ , వెలుగు: నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 11వ తేదీనే  ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర డిప్యూటీ  ఎలక్షన్​ కమిషనర్​ ఉమేశ్​ సిన్హా ప్రకటించారు.సోమవారం అర్ధరాత్రి వరకు ఎన్నికల సంఘం,ఈసీఐఎల్​ టెక్నికల్​ టీం , సీఈవో రజత్ కుమార్​,డీజీపీ మహేందర్​రెడ్డిలతో ఆయన చర్చిం చారు.11నే ఎన్నిక నిర్వహిస్తామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రికార్డు స్థాయిలో 185మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో అందరితోనూ చర్చించామని, టెక్నాలజీ వాడుకుని ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్ ఎన్నికల పర్యవేక్షణకు స్పెషల్​ అబ్జర్వర్లను నియమిం చామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద, ప్రధాన కూడళ్లలో మోడల్​ బ్యాలెట్ హోర్డింగులు,పోస్టర్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తా మన్నారు.

25 వేల ఈవీఎంలు

నిజామాబాద్ ఎన్నికల కోసం 25 వేల ఈవీఎంలు, 2 వేల కంట్రోల్​ యూనిట్లు , 2 వేల వీవీ ప్యా ట్ లు అవసరమని ఉమేశ్​ సిన్హా చెప్పారు. వాటి ఫస్ట్​ లెవెల్​ చెకింగ్ (ఎఫ్ ఎల్​సీ)కి బెల్​, ఈసీఐఎల్​కుచెందిన 600 మంది ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వాళ్లం తా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులోనే ఉంటారని చెప్పా రు. ఈవీఎంలను హైదరాబాద్లోనే తయారు చేయించామన్నారు. ఇంత ఎక్కువమంది అభ్యర్థులున్నా ఈవీఎంలు, వీవీప్యా ట్లతో ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారన్నారు. మామూలుగా అయితే 8 నుం చి10 పోలింగ్ కేం ద్రాలకు ఒక సెక్టో రల్​ ఆఫీసర్​ ఉంటారని, నిజామాబాద్ సెగ్మెంట్ లో మాత్రం 5 కేంద్రాలకు ఒక సెక్టోరల్​ ఆఫీసర్​ ఉంటారని వివరించారు. ఈవీఎం, వీవీప్యా ట్ లపై అవగాహనకోసం జాతీయ స్థాయి మాస్టర్​ ట్రైనర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. 12 ఈవీఎంలకు ఒకకంట్రోల్​ యూనిట్ , ఒక వీవీప్యా ట్ యూనిట్ వాడుతున్నట్టు ఉమేశ్​ సిన్హా చెప్పారు. బెంగళూరులోని బెల్​ నుంచి మంగళవారం ఉదయమే బ్యాలెట్ యూనిట్ల లాట్ బయలుదేరిందన్నా రు.వాటికి బుధవారం ఉదయం ఎఫ్ ఎల్​సీ పూర్తవు-తుందని చెప్పా రు. బుధవారం సాయంత్రానికి నిజామాబాద్ కు ఈవీఎంలు చేరుకుంటాయన్నా రు.ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా రు.

వాయిదా వేసి, బ్యాలెట్‌‌తో

జరపాలి: రైతుల విజ్ఞప్తి

నిజామాబాద్ ఎన్నికను పది రోజులు వాయిదా వేసి, బ్యాలెట్‌‌తోనే పోలింగ్ జరపాలని రైతు అభ్యర్థులు కోరారు. ఎన్నికల అంశాలు తమకు కొత్త కావడంతో అవగాహన కల్పించాలంటూ జాయింట్ సీఈవో ఆమ్రపాలికి వినతిపత్రం అందజేశారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతుధర కల్పించాలని ఆందోళన చేస్తున్న సమయంలోనే ఎన్నికలు వచ్చాయని, దీంతోఅన్ని పార్టీలకూ మన నిరసన తెలిపేందుకే పోటీలో నిలిచామన్నా రు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తమకు ఆర్వోఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నా రు.ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లపై అవగాహనకల్పించాలని కోరారు. ఇప్పటికైనా తమఎన్నికల గుర్తులేంటో చెప్పాలని, లేదంటే కోర్టుకు వెళతామని వారు తేల్చి చెప్పారు.

Latest Updates