బడ్జెట్‌లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై నిరాశ వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో… ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ చూపించారని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని… వాటిని తుంగలో తొక్కారన్నారు. కేంద్రం ఢిల్లీకి ఎలాంటి కేటాయింపులు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజీపీ ప్రధానాంశాల్లో ఢిల్లీ లేదని… ఆ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు సీఎం కేజ్రీవాల్.

Latest Updates