100మందిలో 40మందికే యాంటీజెన్ టెస్ట్ లు : క‌్యూలైన్ల‌లో ప్రాణాలు కోల్పోతున్న ప్ర‌జ‌లు

రాష్ట్రంలో ని ర్యాపిడ్ యాంటీజెన్టెస్టిం గ్‌ సెంటర్ల ముందు వందల సంఖ్యలో జనం పడిగాపులు పడుతున్నారు. సింప్టమ్స్‌ ఉండి కొందరు, పాజిటివ్స్‌కి కాంటాక్ట్‌‌లో ఉండి మరికొందరు, అనుమానంతో ఇంకొందరు టెస్టిం గ్ సెంట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అయితే కరోనా టెస్టుల కోసం ఒక్కో సెంటర్కు సగటున వంద మంది
వస్తుంటే.. నలభై మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 320 సెంటర్లలోయాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్స్లోఆర్పీసీటీ ఆర్టెస్టులు చేస్తున్నారు. అన్ని చోట్లా సరిపడా కిట్లుఅందుబాటులో లేవనే కారణంగా నిర్ణీత కోటా మేరకే టెస్టులు చేస్తున్నారు.

ఎన్ని టెస్టులైనాచేస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌‌జిల్లాల్లో ని ప్రధాన హాస్పిట‌ళ్ల‌లో టెస్టులకు ఎక్కువ చాన్స్ ఉన్నా.. అక్కడా పేషెంట్ల ను తిప్పిపంపుతున్నారు. జిల్లాల్లో టెస్టింగ్ సెంట‌ర్లు చాలా తక్కువగా ఉన్నాయి . ఉన్న వాటిలోనూ
తక్కువ కిట్లుఉండటంతో టెస్టుల కోసం వచ్చేవారికి అవి సరిపోవటం లేదు. దీంతో లక్షణాలున్న బాధితులు భారీ క్యూలైన్లతో ఇబ్బం దులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘వెలుగు’ ప్రతినిధులు శుక్రవారం చేసిన గ్రౌండ్‌ విజిట్‌‌లో కరోనాటెస్టులకు సంబంధించి అనేక వాస్తవాలు వెలుగుచూశాయి.

గ్రేటర్లోనూ తక్కువే..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని కోరంటి హాస్పిటల్‌‌కు టెస్టుల కోసం శుక్రవారం దాదాపు 300 మంది రాగా, 130 మందికే టెస్టులు చేశారు. మేడ్చల్‌‌లో 220 మంది వస్తే 143 మందికి, కీసరలో 180 మంది వస్తే 105 మందికి టెస్టులు చేసి మిగతా వాళ్ల‌ను వెన‌క్కి పంపారు. మారేడుపల్లి సెంటర్‌‌కు 70 మంది వస్తే 50 మందికే టోకెన్‌ దొరికింది. సిటీలో దాదాపు అన్ని సెంట‌ర్ల‌లో ఇరవై నుంచి ఎనభై మంది వరకు టెస్టుచేయించుకునే చాన్స్ లేక వెనుదిరుగుతున్నారు. లక్షణాలు లేని వారికి చాలా సెంట‌ర్ల‌లో టెస్టులే చేయడం లేదు. హైదరాబాద్ జిల్లాల్లో 97 సెంట‌ర్ల‌లో ప్రతి రోజు 4 వేల వరకు, మేడ్చల్‌‌జిల్లాలో 96 సెంటర్ల‌లో 2వేల వ‌ర‌కు, రంగా రెడ్డి జిల్లాలోని 48 సెంట‌ర్ల‌లో ఐదారు వందల వరకు మాత్రమే టెస్టులు చేస్తున్నారు. ఈ మూడు జి
ల్లాల్లో కలిపి రోజు వెయ్యికి పైగా పాజిటివ్‌‌కేసులు వస్తున్నాయి.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..

వ‌రంగ‌ల్ జిల్లా -నర్సంపేట సీహెచ్ సీ, వ‌ర్ధ‌న్న పేట సీహెచ్ సీ, ప‌ర్వ‌త‌గిరి సీహెచ్ సీ, శాయంపేట సీహెచ్ సీ, దామెర పీహెచ్ సీ ల్లో ల్యాబ్ టెక్నీషియ‌న్స్ లేక టెస్టులు చేయలేదు. రాయపర్తి పీ హెచ్సీలో డాక్టర్ లేక టెస్టులు ఆపేశారు.

జనగామ జిల్లా హాస్పిటల్ కు వచ్చిన 15 మంది అనుమానితులను స్టాఫ్ వెన‌క్కి పంపారు. సిమ్టమ్స్ మామూలుగా ఉన్నందున హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పి పంపేశారు.

కరీంనగర్ జిల్లాచొప్పదండి పీహెచ్ సీల్లో కిట్లు లేకపోవడంతో 10 మందిని తిప్పిపంపారు. చిల్పూర్ పీహెచ్సీలో డాక్టర్ తో పాటు స్టాఫ్ కు పాజిటివ్ రావడంతో టెస్టులు చేయడం లేదు. హుజూరాబాద్ లో 200 మంది వచ్చినా 100 మందికే టెస్టులు చేశారు. మానకొండూరు పీహెచ్ సీలో ల్యాబ్ టెక్నీషియన్ రాకపోవడం తో టెస్టులు చేయలేదు. తిమ్మాపూర్ పీహెచ్ సీల్లో వైద్యాధికారి శ్రీనివాస్, టెస్టుల సిబ్బం ది లీవ్ లో ఉండడం వల్ల వారం నుంచి టెస్టులు చేయడం లేదు.

ఆదిలాబాద్ జిల్లాలోని పీహెచ్ సీల్లో , అర్బన్ హెల్త్ సెంట‌ర్ల‌కు టెస్టుల కోసం వేలాది మంది వచ్చినా .. 22 0 మందికే టెస్టు చేశారు.అందులో 31 మందికి పాజిటివ్ వచ్చింది.

మంచిర్యాల జిల్లా హాస్పిట‌ల్ తో పాటు బెల్లం పల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట సీహెచ్సీల్లో అనుమానితులు టెస్టుల కోసం బారులు తీరినా..మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వారికే టెస్టులు చేశారు. దీంతో సగం మందికిపైగా వెనుదిరగాల్సి వచ్చింది. కొంతమంది లీడర్లు తమ సన్నిహితులకు టెస్టుల కోసం డాక్ట‌ర్ల‌పై తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్గొండ పట్టణంలోని పానగల్ యూహెచ్ సీ,హాలియా పీహెచ్ సీల్లో కిట్లులేక శుక్రవారం టెస్టులు ఆపేశారు.

సూర్యాపేట జిల్లాఆస్పత్రిలో లక్షణాలు లేవని చాలామందికి అజిత్రోమైసిన్, పారాసిటమాల్,విటమిన్ సి టాబ్లెట్స్ ఇచ్చి పంపేశారు.

కోదాడ టౌన్ కు చెందిన ఎలక్ట్రికక్ట్రిల్ డిపార్ట్మర్టెంట్ ఏఈ భార్యకు, తల్లికి పాజిటివ్ వచ్చింది. తన 3 నెలల కొడుకుని తీసుకుని టెస్టుల కోసం రాగా, లక్షణాలు లేవని వెనక్కి పంపారు.

యాదాద్రి జిల్లాఆలేరు ఏరియా హాస్పిటల్లో కిట్లు అయిపోయాయని టెస్టులు ఆపేశారు. శారాజీపేట, మోత్కూరు, అడ్డగూడురు, ఆత్మకూర్(ఎం), బీబీనగర్, కొండమడుగు, బొల్లేపల్లి,
బొమ్మల రామారం, తుర్కపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, వర్కట్పల్లి, తంగడపల్లి, వెల్వర్తి పీహెచ్సీల్లో టెస్టులు చేయలేదు.

సిద్దిపేటలోని రెం డు పీహెచ్ సీల్లో‌‌యాంటిజెన్ టెస్టులపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఆపేసి, లెప్రసీ హాస్పిటల్లో చేస్తున్నారు. జనరల్‌‌ఆస్పత్రి, యూహెచ్సీ మధ్య సమన్వయం లేక జనాన్ని రెండింటికి తిప్పుతున్నారు.

భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలోని పలు పీహెచ్ సీలు, యూహెచ్సీలకు టెస్టిం గ్ కిట్లువచ్చినా ల్యాబ్ టెక్నీషియన్స్ లేక మూలపడ్డాయి . బూర్గంపాడు పీహెచ్సీకి 24 కిట్లువచ్చినా టెక్నీ షియన్ లేక టెస్టులు చేయలేదు. మణుగూరు పీహెచ్సీకి వచ్చిన కిట్లు అయిపోవడంతో పరీక్షలు ఆపేశారు.

భద్రాచలం ఏరియా ఆస్ప త్రిలో ఎంత మంది వచ్చినారోజుకు పది టెస్టులే
చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ టెస్టుల చేయడం లేదని అడిగితేమ్యాన్‍పవర్దని చెబుతున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లామానవపాడు పీహెచ్సీ పరిధిలో స్టాఫ్కు పాజిటివ్ రావడంతో టెస్ట్ లు ఆపే శారు. అలంపూర్ పీహెచ్సీకి 100 మంది వస్తే.. 38 మందికే టెస్టులు చేశారు. అందులో 13 మందికి పాజిటివ్ వచ్చింది.

Latest Updates