అఖిలప్రియకు నో బెయిల్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. అఖిలప్రియను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అఖిలప్రియను పోలీసులు కస్టడీకి తీసుకొని కిడ్నాప్ వ్యవహారంపై ప్రశ్నించనున్నారు. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకొని ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

For More News..

16 వేల కిలోమీటర్లు.. 17 గంటలు.. 30 వేల ఫీట్ల ఎత్తు.. ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల రికార్డు

నిమ్స్ హాస్పిటల్ వెనుక ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాక

Latest Updates