బడ్జెట్‌తో దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదు: రాహుల్‌

బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిరాశ వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌తో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు.  బడ్జెట్ ప్రసంగం చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా ఉందన్న రాహుల్ .. ఆలోచించి చూస్తే వట్టి డొల్లలాగే ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో చెప్పుకోదగ్గ విషయాలేవీ లేవన్నారు.. దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఉందని..అయితే యువతకు ఉద్యోగాల కల్పనకు తోడ్పడేలా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. బడ్జెట్ లో చాతుర్యం ప్రదర్శించారే తప్ప ఎలాంటి ముఖ్యోద్ధేశాలు కనిపించలేదన్నారు. పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెబుతున్నారని విమర్శించారు రాహుల్.

Latest Updates