కండక్టర్ మధు అందర్ని ఫూల్స్ చేశాడు : సివిల్స్ రాయలేదు

కొద్దిరోజుల క్రితం వచ్చిన బస్ కండక్టర్ ఐఏఎస్ దిశగా అడుగులు వేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే  వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని తేలింది.

కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన  మధు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటర్ వరకే చదివిన మధు తన 19 ఎళ్ల వయసులో కేఎస్ ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో పని చేస్తూనే  కరస్పాండెన్స్ లో డిగ్రీ, పీజీ విద్యలను పూర్తి చేశాడు. అంతేకాదు తనకెంతో ఇష్టమైన సివిల్స్ సర్వీస్ కోసం పరీక్షలకు సిద్ధమయ్యాడు.  ఓ వైపు కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే  రోజుకు ఐదు గంటలపాటు చదవి గతేడాది సివిల్స్ ఎగ్జామ్ రాశాడు.  ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌‌ లో పాస్ అయిన కండక్టర్  ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే సివిల్స్ సర్వీస్ హోదాలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

ఇదంతా కండక్టర్ మధు గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ఇందులో వాస్తవం లేదని బెంగళూరుకు చెందిన పలువురు ఔత్సాహికులు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు.

బెంగళూరుకు చెందిన పలువురు ఔత్సాహికులు జనవరి 14, 2020 నాటి  ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఐఎస్) కు ఎంపిక కోసం  జరిగిన ఇంటర్వ్యూ లో అర్హత సాధించిన అభ్యర్థుల (పేర్లు మరియు రోల్ నంబర్లు) గురించి సమాచారాన్ని సేకరించారు.  ఇండియన్ పోలీస్ సర్వీస్ (ips), మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’).  పరిశీలించిగా ఆ అభ్యర్ధుల జాబితాలో మధు పేరు లేదని తేలింది. అతను పరీక్షలను క్లియర్ చేయలేదని సూచిస్తుంది. మధు పేరుతో  ఉన్న మార్క్ షీట్ చెక్ చేయగా మధు కుమారి అనే మహిళగా గుర్తించారు. దీంతో కండక్టర్ పై వచ్చిన ఐఏఎస్ కథనాల్లో వాస్తవం లేదని తేలింది.

అబద్ధం చెప్పిన కండక్టర్ మధు

ఐఏఎస్ ప్రిలిమ్స్‌‌, మెయిన్స్‌ పాస్ అయినట్లు త్వరలో ఇంటర్య్వూకి అటెండ్ అవుతున్నట్లు తాను పనిచేస్తున్న డిపో అధికారులకు చెప్పడం..అధికారులు  బెంగళూరుకు ఓ మీడియా సంస్థ చెప్పడంతో వైరల్ అయ్యింది. డిపో అధికారుల్ని నమ్మించేందుకు మరో రోల్ నెంబర్ చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడని, వాస్తవానికి మధు చెప్పిన రోల్ నెంబర్ మధుకుమారి అనే మహిళదని తేలినట్లు,  మధు పై ప్రచురించిన కథనాల్ని తొలగిస్తున్నట్లు సదరు సంస్థ ఎడిటర్ తెలిపారు. కండక్టర్ మధు డిపో అధికారులు ఎందుకు అబద్ధం చెప్పాడో తెలియదని ఎడిటర్  అన్నారు.

Latest Updates