అంతుబట్టని తమిళనాడు రాజకీయాలు

No Big Leaders in the Mix, Political Undercurrents Could Play a Large Role in TN
  • తొలిసారిగా జయ, కరుణ లేకుండా ఎన్నికలు
  • ఎన్నడూ లేనంతగా డబ్బు ప్రభావం
  • విజేత ఎవరో చెప్పడం కష్టమే
  • గెలుపును ప్రభావితం చేసే అంశాలెన్నో

చెన్నై: తమిళనాడులో ఈసారి లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు ఎవరికీ అంతు బట్టడంలేదు. జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్‌ నాయకుల్లేకుండా జరుగుతున్న ఎలక్షన్లలో ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుం దో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నా రు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడుకు చెం దిన ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే), అల్‌ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పాయి. నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్డీయే సర్కార్‌ లో మాత్రం  ఈపార్టీలకు ఎలాంటి ప్రాధాన్యమూ లేదు. బీజేపీ- అన్నాడీఎంకేకూటమి, కాంగ్రెస్‌ -డీఎంకే కూటమి నువ్వా నేనా అని తలపడుతుండడంతో గెలుపుపై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మాజీ ముఖ్యమంత్రులు  జయలలిత,ఎం.కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి లోక్‌ సభ ఎన్నికలు కావడంతో ఓటరు తీర్పు ఎలా ఉంటుం దన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోం ది.ఈ ఇద్దరు నాయకులు తమిళనాడు రాజకీయాలను శాసించారు.

బలహీనంగా అన్నాడీఎంకే

2016లో జయలలిత చనిపోవడంతో అన్నా డీఎంకే ప్రభుత్వం లో చాలా సమస్యల్ని ఎదుర్కొం ది. ఇప్పటికీ ఆమె లేని లోటు పార్టీకి పూడ్చలేనిది. ఒక దశలో పార్టీమూడు ముక్కలైంది. టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని ఏఎంఎంకే అన్నాడీఎంకే పార్టీకి ప్రమాదకరంగా మారింది. బీజేపీతో పొత్తుపైనా కొంతమంది అన్నా డీఎంకే కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.అన్నా డీఎంకే గనక బీజేపీ చేతిలోకి వెళితే .. ద్రవిడ సంస్కృతి, ప్రాంతీయ ప్రాభవానికి పెద్ద దెబ్బతగిలే అవకాశం ఉందని భావిస్తున్నా రు.

డీఎంకేకి సమర్థమైన నాయకత్వం

కరుణానిధి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఎం.కె. స్టాలిన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నా డీఎంకేతో పోల్చుకుం టే.. స్టాలిన్‌ రూపంలో డీఎంకేకు సరైన వారసుడు దొరికారని ఆపార్టీ క్యాడర్‌ భావిస్తోంది. కాం గ్రెస్‌ తో పొత్తుపెట్టుకున్న స్టాలిన్‌ కు ఈ ఎన్నిలు ఒక సవాల్‌ లాంటివే అని చెప్పొచ్చు. మంచి ఫలితాలు సాధించి తానేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని ఆయన ముందుంది. పార్టీతో పాటు కూటమి అభ్యర్థులకు చేస్తున్న ప్రచారాలకు కూడా జనం బాగానే వస్తున్నారు.

2014 లోక్‌ సభ ఎన్నికల్లో 37 సీట్లు సాధించిన అన్నా డీఎంకే పార్టీకి ఈసారి అన్ని స్థానాలు వచ్చేఅవకాశంలేదు. పైగా ఈసారి ఆపార్టీ కేవలం 20సీట్లకు మాత్రమే పోటీచేస్తుండడంపై పార్టీ కేడర్‌ కూడా అయోమయానికి గురైందని అంటున్నారు.అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగమ్‌ ( ఏఎంఎంకే) చీఫ్‌ దినకరన్‌ కూడా అన్నాడీఎంకే గెలుపును ప్రభావితం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రతి నియోజకవర్గం లోనూ పోటీలో ఉంది. ముఖ్యం గా థేవర వర్గానికి చెందిన ఓట్లు దినకరన్‌ కు పడతాయని కూడా చెబుతున్నా రు. ఈ వర్గం వాళ్లు దక్షిణ, మధ్య తమిళనాడులో ఎక్కువమంది ఉన్నారు.

బరిలో ఉన్న చిన్నపార్టీల ప్రభావం కూడా ఫలితాలపై ఉండే అవకాశముం ది. వైకో పార్టీ ఎండీఎంకే,విజయ్‌ కాంత్‌ పార్టీ డీఎండీకే, ఎల్టీటీఈ నాయకుడు వెలుపిళ్లై ప్రభాకరన్‌ స్ఫూర్తిగా ఏర్పడ్డ సీమన్‌ నేతృత్వం లోని నామ్‌ తమిళర్‌ కల్చి (ఎన్‌ టీకే) లాంటి పార్టీలకు కూడా కొన్ని చోట్ల చెప్పుకోతగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఫిల్మ్‌‌ స్టార్‌ కమల్‌ హసన్‌ పార్టీ ఎంఎన్‌ ఎం ఈఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించదని అంచనా వేస్తున్నారు.

డబ్బు ప్రభావం

ఇంతకుముం దు ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కవగా ఉండే అవకాశముంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ సుమారు 552 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం చూస్తుం టే డబ్బు ప్రభావాన్నిఅంచనా వేయొచ్చు.

Latest Updates