కీలక వడ్డీ రేట్లు యథాతథం

  • వెల్లడించిన ఆర్‌‌బీఐ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్‌‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. గురువారం జరిగిన విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంగ్‌ దాస్‌ చెప్పారు. ఆర్‌‌బీఐ రెపోరేట్‌ను 4 శాతంగా.. రివర్స్‌ రెపోరేటును 3.3 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతోపాటు అకామిడేటీవ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆర్‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అన్నారు. పంపిణీ వ్యవస్థలకు అడ్డంకులు తలెత్తడంతో వివిధ రంగాల్లో ఇన్‌ఫ్లేషన్‌పై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.

Latest Updates