ఐదు రోజులు ఛార్జింగ్​ పెట్టక్కర్లేదు!

ప్రస్తుతం స్మార్ట్‌‌ఫోన్లలో వాడుతున్న బ్యాటరీలన్నీ ‘లిథియం–అయాన్‌‌’ బ్యాటరీలే. దీని కెపాసిటీకి పరిమితులున్నాయి. అలాగే కొన్ని బ్యాటరీలు పేలిపోతున్నాయి కూడా. అందుకే మరింత ఎక్కువ కెపాసిటీతో, ఎలాంటి ప్రాబ్లమ్స్‌‌ రాని కొత్త రకం బ్యాటరీల కోసం సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లిథియం–సల్ఫర్‌‌’ బ్యాటరీలను తయారు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌‌బోర్న్‌‌కు చెందిన ‘మోనాష్‌‌ యూనివర్సిటీ’ సైంటిస్టులు ఈ బ్యాటరీలను తయారు చేశారు. ఇవి స్మార్ట్‌‌ఫోన్లపై దాదాపు ఐదు రోజులపాటు పని చేస్తాయని సైంటిస్టులు అంటున్నారు.

‘‘లిథియం–సల్ఫర్‌‌‌‌ బ్యాటరీలను ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇవి మరింత బాగా పని చేస్తాయి. ఎక్కువ సేపు వాడినా వేడెక్కవు. అందువల్ల పేలే ప్రమాదం కూడా లేదు. వీటిని తయారు చేయడం చాలా సులభం. పైగా ఖర్చు కూడా తక్కువే. మరి కొద్ది రోజుల్లోనే వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం” అని శాస్త్రవేత్తలు చెప్పారు. గతంలో కొందరు సైంటిస్టులు ‘లిథియమ్‌‌–అయాన్‌‌’ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా ‘క్యాల్షియం ఆనోడ్‌‌’ బ్యాటరీలను రూపొందించారు. మరికొందరు ‘ఐరన్‌‌–అయాన్‌‌’ బ్యాటరీలను తయారు చేశారు. అయితే వీటన్నింటిలో లోపాలు లేకుండా ఉండి, లాభాలు వస్తాయనిపిస్తే ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Latest Updates