డెంగీ చావులపై ఉత్తుత్తి కమిటీలేనా!

లెక్క తేలుస్తామని చెప్పి సప్పుడు చేయని సర్కారు

హైదరాబాద్, వెలుగు: డెంగీ మరణాల లెక్క తేలుస్తామని చెప్పిన రాష్ర్ట ప్రభుత్వం.. మూడు నెలలైనా సప్పుడు చేయడం లేదు. సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ ఇంతవరకూ ఒక్క మరణంపై కూడా ఆడిట్ నిర్వహించలేదు. తమకు మరణాల వివరాలే ఇవ్వలేదని కమిటీ సభ్యులు చెబుతున్నారు. దీంతో కాలయాపన చేసేందుకే కమిటీ వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

మేం ఏం చేస్తం..

ఈ ఏడాది డెంగీతో రాష్ర్టంలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అవన్నీ డెంగీ మరణాలు కాదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. తమ అనుమతి లేకుండా డెంగీ డెత్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించొద్దని ప్రైవేటు హాస్పిటళ్లకు ఆదేశాలిచ్చింది. సస్పెక్టెడ్‌‌‌‌‌‌‌‌ డెంగీ డెత్స్‌‌‌‌‌‌‌‌పై విచారించి, మరణాలకు గల కారణాలు తేల్చేందుకు సీనియర్ ప్రొఫెసర్లు, హెల్త్ ఆఫీసర్లతో కమిటీ వేసింది. కమిటీ వేసిన 45 రోజుల తర్వాత తొలిసారి సభ్యులు సమావేశమయ్యారు. ‘డెంగీ’తో మరణించిన వారికి చేసిన టెస్టుల వివరాలు సహా కేసు షీట్లు సేకరించి ఇవ్వాలని కోరారు. ఇది జరిగి నెల దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క కేసు షీటు కూడా కమిటీకి హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అందజేయకపోవడం గమనార్హం. కేసు షీట్లు ఇవ్వకుంటే తాము మాత్రం ఏంచేస్తామని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

క్లినికల్‌‌‌‌‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ కేసులో చర్యలేవి?

నీలోఫర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రూల్స్​కు విరుద్ధంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అదే దవాఖానలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. చిన్న పిల్లలపై వాళ్ల తల్లిదండ్రులకు తెలియకుండా ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. తమ పిల్లలపై కూడా ట్రయల్స్ జరిగాయేమోనని కంగారు పడ్డారు. నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ వేసింది. ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దవాఖానలో ప్రయోగాలు జరుపుతున్న డాక్టర్లను ఒక రోజంతా ఈ కమిటీ ప్రశ్నించింది. ప్రయోగ వివరాలను, వాలంటీర్ల తల్లిదండ్రులను ప్రశ్నించి నివేదిక రూపొందించింది.

ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా అందులో ఏముందన్న అంశాన్ని బయట పెట్టలేదు. అయితే, చిన్న చిన్న ఉల్లంఘనలు జరిగినట్టు తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ మధ్య మీడియా సమావేశంలో ప్రకటించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా.. ఇంతవరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ ప్రారంభించలేదు. దీంతో ఆరోగ్యశాఖలో కమిటీలు కాలయాపనకే తప్ప.. చర్యలుండవన్న విమర్శలొస్తున్నాయి. ఉల్లంఘనులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో దీన్ని అలుసుగా తీసుకుని మరొకరు కూలా ఇలాగే చేసే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Updates