నార్త్‌ఈస్ట్‌లో మరో కరోనా ఫ్రీ స్టేట్‌

  • త్రిపురలో నమోదు కాని కొత్త కేసులు
  • పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు డిశ్చార్జ్‌

గౌహతి: నార్త్‌ ఈస్ట్‌లో నాలుగు రాష్ట్రాలను ఇప్పటికే అధికారులు కరోనా ఫ్రీగా గుర్తించారు. కాగా.. ఇప్పుడు త్రిపుర కూడా ఆ జాబితాలో చేరింది. దేశంలో కరోనా లేని ఐదో రాష్ట్రం త్రిపురనే. రాష్ట్రంలో కేవలం రెండు పాజిటివ్‌ కేసులే నమోదయ్యాయని, ఆ ఇద్దరు కూడా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు చెప్పారు. గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. పాజిటివ్‌ కేసుల రాగానే అప్రమత్తమైన యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేసి ట్రేస్‌ చేసింది. మొత్తం 40లక్షల జనాభాలో దాదాపు 4500 మందికి టెస్టులు చేశామని అధికారులు చెప్పారు. అంటే పదిలక్షల మందిలో దాదాపు 1050 మందికి. దేశవ్యాప్త టెస్టులతో పోలిస్తే ఇదే ఎక్కువ. “ టెస్టులు చేయడంపైనే ఎక్కువగా ఫోకస్‌ చేశాం. ఇప్పుడు ఇక బయట నుంచి త్రిపురలోకి వచ్చే వారికి కచ్చితంగా టెస్టులు చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చేవారిపై ఫోకస్‌ పెడతాం” అని త్రిపుర హెల్త్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌‌ రాకేశ్‌ చెప్పారు. నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల్లో మొదటి నుంచి కేసులు తక్కువగానే నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదు కాగా.. సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్‌గా మారాయి.

Latest Updates