స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి  రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదని …. తాము కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రొసీడింగ్స్ లో ఆమె స్పష్టం చేశారు.

Latest Updates