12లక్షల కోట్ల బంగారం నిక్షేపాలపై బాంబు పేల్చిన జీఎస్ఐ

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,350టన్నుల గోల్డ్ నిక్షేపాలనున్నట్లు వస్తున్నట్లు వార్తల్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) ఖండించింది.

శుక్రవారం రెండు దశాబ్దాల వెతుకులాటలో రెండు బంగారు కొండలను జియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (జీఎస్​ఐ), ఉత్తర్​ప్రదేశ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ జియాలజీ అండ్​ మైనింగ్​ గుర్తించినట్లు సోన్ భద్రా డిస్ట్రిక్ మైనింగ్​ ఆఫీసర్​ కేకే రాయ్​ తెలిపారు. దీంతో 12లక్షల కోట్ల విలువైన బంగారు నిక్షేపాలున్నాయనే వార్త దావానంలా పాకింది.

బంగారు నిక్షేపాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై అప్రమత్తమైన జీఎస్ ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శ్రీధర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సోన్‌భద్ర జిల్లాలో భారీ మొత్తంలో బంగారు నిక్షేపాలు జీఎస్ ఐ గుర్తించలేదని, ఈ నివేదిక తాము ఇవ్వలేదని తెలిపారు. అంతేకాదు మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన ఆయన  1998-2000 మధ్య ఖనిజ నిక్షేపాల కోసం యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో అన్వేషించామన్నారు.ఈ అన్వేషణలో మొత్తం 52,806.25 టన్నుల కేత్రాలుగా ఉండగా వాటిని వెలికి తీసి శుద్ధి చేస్తే టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ శ్రేణి బంగారం వస్తుందన్నారు. ఆ లెక్కన చూస్తే మొత్తం 160 కిలోల బంగారాన్ని వెలికి తీయోచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ ఎం.శ్రీధర్‌ అంచనా వేశారు.

Latest Updates