వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతున్నందున వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటుతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో కచ్చితంగా చెప్పలేనందున ఎకానమీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె తెలిపారు. ‘ఆరు నెలల్లో సవాళ్లను తగ్గించలేకపోయాం. కానీ వాటి సహజత్వాన్ని మార్చగలిగాం. సాధారణ సమయంలో కంటే ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత వేగంగా స్పందిస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కచ్చితమైన డేట్ చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో కరోనా రికవరీలు మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి పలు విషయాలు ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌ను తీవ్ర అనిశ్చితికి గురి చేస్తున్నాయి’ అని నిర్మల చెప్పారు.

Latest Updates