రాత్రి 7 దాటితే ఏపీలోకి నో ఎంట్రీ

నల్గొండ క్రైం, వెలుగు: వాడపల్లి మీదుగా ఏపీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోగా వెళ్లిపోవాలని, ఆ తర్వాత అనుమతి ఉండదని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అన్ని వాహనాలను సాయంత్రం 7 గంటల తర్వాత సరిహద్దుల్లో ఆపేస్తామని గుంటూరు ఎస్పీ చెప్పారన్నారు. కాబట్టి ఆ టైంలో వెళ్లి అనవసరంగా ఇబ్బందులు పడొద్దని ప్రయాణికులకు సూచించారు. నాగార్జునసాగర్–మాచర్ల రోడ్డును ఏపీ సర్కార్ ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించలేదని, కాబట్టి ఆ బాటలో ఎలాంటి ప్రజారవాణనుగానీ, వాహనాలనుగానీ ఏపీ పోలీసులు అనుమతించట్లేదని చెప్పారు. సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా అందరూ తప్పనిసరిగా పాస్లు తీసుకోవాలన్నారు. పాస్లు లేకుంటే ఆపేస్తారని చెప్పారు.

For More News..

రాష్ట్రంలో 15 వేలకు చేరువలో కరోనా కేసులు

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..

Latest Updates