పాకిస్థానీలకు నో ఎంట్రీ : ప్రయాగరాజ్ హోటల్ లో నోటీస్

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వంపై అంతటా వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని భారత్ చేస్తున్న వాదనకు ప్రపంచం మద్దతు పలికింది. ఇటీవలే .. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కావడానికి.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని.. వారిని ఎటువంటి సహాయం అందివ్వడానికి వీల్లేదని జనం అంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేవరకు పాకిస్థానీలను ఇండియాలోకి అనమతించొద్దని కూడా కోరుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో పాకిస్థానీలకు నో ఎంట్రీ చెబుతోంది ఓ హోటల్. ప్రయాగరాజ్ లో హోటల్ మిలాన్ ప్యాలెస్ అనే ప్రముఖ హోటల్ ఉంది. తమ హోటల్ కు పాకిస్థాన్ దేశస్తులు రావొద్దని.. వచ్చినా వారికి ఎటువంటి రూమ్స్ ఇచ్చేదిలేదంటూ ఫ్రంట్ ఆఫీస్ లో ఓ నోటీస్ పెట్టింది. పుల్వామా ఎటాక్ తర్వాత ఈ నోటీసు పెట్టామని.. అప్పటినుంచి దానినే కొనసాగిస్తున్నామని చెప్పారు హోటల్ మేనేజర్. మాకు తెలిసిన పద్ధతిలో మేం నిరసన తెలుపుతున్నాం అన్నారాయన.

Latest Updates