వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా లీకైనట్లు ఆధారాలు లేవు

కరోనా వైరస్ వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచి  లీకైనట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు చైనా ప్రముఖ వైరాలజీ సైంటిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్కిన్. లిప్కిన్ ఇండియా టుడే తో మాట్లాడుతూ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

కరోనా సహజంగా సోకే వైరస్ అని మీరు నమ్ముతారా అన్న ఇండియా టుడే ప్రశ్నలపై ల్యాబ్ లో తయారు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అలా చేశారనడానికి ఎలాంటి డేటా లభ్యం కాలేదన్నారు. నెలన్నర క్రితం వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైనట్లు వచ్చిన వార్తల్ని తాను చదివానని అన్నారు.

ఈ వైరస్ జన్యుపరంగా గబ్బిలాల నుండి బయటకు వచ్చిందన్నారు. గబ్బిలాలలో వైరస్ ఉందని, ఆ వైరస్ రకరకాల కారణాల వల్ల మనుషులకు సోకుతుందన్నారు.

ప్రపంచంలో మిలియన్లు వైరస్ లు ఉన్నాయి

ప్రపంచం మొత్తంలో మిలియన్ అంతకంటే ఎక్కువ వైరస్ లు ఉన్నాయని వాటిలో కొన్ని మానవుల నుంచి వస్తాయని అన్నారు.  ఆఫ్రికాలో ఎబోలా మాదిరిగానే ఉద్భవించిందని, నిఫా మలేషియా నుంచి , సార్స్ చైనా నుంచి వచ్చినట్లు లిప్కిన్ చెప్పారు.

కరోనా వైరస్ మహమ్మారే

గతంలో కంటే  చాలా అరుదుగా ఉన్న వైరస్ కరోనా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు.  జనాభా, వలస, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని చైనా ప్రముఖ వైరాలజీ సైంటిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్కిన్ వెల్లడించారు.

Latest Updates