టాయిలెట్ పేపర్ వార్తల్ని ఖండించిన గూగుల్

No evidence our images showed Pakistan flag for toilet paper: Google

No evidence our images showed Pakistan flag for toilet paper: Googleపాకిస్థాన్ జెండా.. ప్రపంచంలోనే బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇదే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు తెగ హల్ చల్ చేశాయి. గూగుల్ లో చైనా మేడ్ టాయిలెట్ పేపర్ అని గానీ, బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్ అని గానీ సెర్చ్ చేస్తే పాక్ జెండానే వస్తోందని వార్తలు షికార్లు కొట్టాయి. పుల్వామా దాడి తర్వాత సోషల్ మీడియాలో ఇది విపరీతంగా ట్రెండింగ్ అయింది. వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ పోస్టుల్లోనూ చాలా మంది గూగుల్ సెర్చ్ రిజల్ట్ అంటూ దీని స్ర్కీన్ షాట్స్ పెట్టి ప్రచారం చేశారు. ఇది వైరల్ అవడంపై జాతీయ, లోకల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి.

ఫేక్ అని తేల్చిన గూగుల్

పాక్ జెండా టిష్యూ పేపర్, బెస్ట్ టాయిలెట్ పేపర్ అని గూగుల్ సెర్చ్ లో వస్తోందంటూ జరిగిన ప్రచారం ఫేక్ అని గూగుల్ తేల్చింది. దీనికి ఎటువంటి ఎవిడెన్స్ లేదని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఉన్న అల్గారిథమ్స్ ను పరిశీలించామని, అటువంటి రిజల్ట్స్ ఎప్పుడూ రాలేదని చెప్పారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా రావడంతో గూగుల్ లో వాటికి సంబంధించిన ఫొటోల వస్తున్నాయని వివరించారు.

Latest Updates