BSF దళాలు స్వీట్లు ఇచ్చినా తీసుకోని పాక్ రేంజర్లు

ఇవాళ(ఆగస్టు-14) పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా అట్టారి-వాఘా సరిహద్దు దగ్గర BSF దళాలు..పాక్ రేంజర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వాటిని తీసుకునేందుకు పాక్ రేంజర్లు నిరాకరించారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి పాక్‌ తెరదించింది. మొన్న జరిగిన బక్రీద్‌ పర్వదినం రోజున BSF దళాలు, పాక్‌ రేంజర్లు స్వీట్లు పంచుకోలేదు. ఇవాళ కూడా అదే పునరావృతం అయ్యింది.

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌తో పాక్‌ అన్ని సంబంధాలను తెంచేసుకుంటోంది.

Latest Updates