మాస్కులు పెట్టుకోలేద‌ని 137 మందిని అరెస్ట్ చేశారు

గౌహ‌తీ : ఫేస్ కు మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల‌పైకి వ‌చ్చిన 137 మందిని అరెస్ట్ చేశారు  గౌహ‌తీ పోలీసులు. హిరంగ ప్ర‌దేశాల్లో ఫేస్ మాస్కులు ధ‌రించి మాత్ర‌మే క‌నిపించాల‌ని, లేకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎంపీ గుప్తా హెచ్చ‌రించారు. క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నా..కొంద‌రు వాటిని లెక్క చేయ‌డం లేదన్నారు.

అత్య‌వ‌స‌ర స‌య‌మంలో త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారని, అయితే పోలీసులు ఇంత చేస్తున్నా అసోంలోని గువాహ‌టిలో ఫేస్‌ మాస్కులు లేకుండా రోడ్ల‌పైకి వ‌స్తున్నారని తెలిపారు. ఈ క్ర‌మంలోనే గురువారం ఫేస్ కు మాస్కులు లేకుండా రోడ్ల‌పైకి వ‌చ్చిన 137 మందిని అరెస్ట్ చేశామ‌ని తెలిపారు పోలీస్ క‌మిష‌న‌ర్ ఎంపీ గుప్తా.

Latest Updates