ఆపరేషన్లు లేవు.. అద్దాల్లేవు.. టెస్టులకే ‘కంటి వెలుగు‘ పరిమితం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘కంటి వెలుగు’ పథకం కిందపరీక్షలు చేయించుకున్న లక్షల మంది.. ఆపరేషన్లు,కండ్లద్దాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. గతేడాది ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నాటి నుంచి 827 వైద్యబృందాలు ఊరూరా తిరిగి ఒక్క కోటీ 54 లక్షలమందికి కంటి పరీక్షలు చేశాయి. కంటి వెలుగుకార్యక్రమం పూర్తయినట్టు ఇటీవలే ఆరోగ్యశాఖప్రకటించిం ది. కోటీ 54లక్షల మందిలో 67.44శాతం అంటే.. కోటీ 4 లక్షల మందికి ఎలాంటి కంటి జబ్బులూ లేవని డాక్టర్లు తేల్చారు. 32.56శాతం అంటే.. 50 లక్షల 37 వేల 117 మందికి వివిధ రకాల కంటి జబ్బు లు ఉన్నట్టు నిర్ధారిం చారు. ఇందులో6,42,290 మందికి కాటరాక్ట్‌‌‌‌(శుక్లాలు) ఆపరేషన్లు,3,16,976 మందికి ఇంకా పెద్ద ఆపరేషన్లు అవసరమని వారు సూచించారు. కార్యక్రమం ప్రారంభమై 9 నెలలు కావస్తున్నా, వీరిలో కనీసం 5 వేల మందికి కూడా ఆపరేషన్లు చేయలేదు. 9 లక్షల మందికిపైగా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఒకట్రెండు చోట్ల కంటి ఆపరేషన్లు వికటించినట్లు వార్తలొచ్చాయి. పరిస్థితిని చక్కదిద్ది ఆపరేషన్లు కొనసాగించాల్సి ఉండగా.. వాటిని సాకుగాచూపి మొత్తం ఆపరేషన్లనే ఆపేశారన్న విమర్శలుఉన్నాయి. ‘‘ఆరునెలల కింద కళ్లను చెక్ చేసిన డాక్టర్లు.. రోగమున్నదని చెప్పిండ్రు. ఆపరేషన్ అవసరమని చెప్పి పోయిండ్రు. మల్లా ఆ ముచ్చటే లేదు”అనిబాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకూతమకు కంటి వ్యాధులు ఉన్నాయని కూడా తెలియని వృద్ధులు, ఇప్పుడు తమ కంటికే దో అయ్యిందని తెలిశాక ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వం అందజేసే ఉచిత ఆపరేషన్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

నిధులున్నా నిర్ణయమేది?

కంటి వెలుగులో చేసే శుక్లాల ఆపరేషన్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. లయన్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌, ఎల్వీప్రసాద్ తదితర సంస్థలు ఒక్కో ఆపరేషన్ కు కేంద్రం ఇచ్చే రూ. 2 వేలతో ఆపరేషన్లు చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి.అవసరమైన నిధులుండి, పైగా ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రులు ముందుకొస్తున్నా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై ఆ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. కంటి వెలుగు ప్రారంభిం చినప్పుడు వచ్చిన మంచిపేరు కాస్త, ఆపరేషన్లు చేయకపోవడంతో చెడుగా మారుతోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లోవినిపిస్తోంది. ఆపరేషన్ల విషయంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నఆరోపణలూ వినిపిస్తున్నాయి.కండ్లద్దాల జారీలోనూ ఆలస్యం కంటి పరీక్షలు చేయించుకున్న 1.54 కోట్లమందిలో18.13 లక్షల మందికి వివిధ స్థాయిల్లో దృష్టిలోపం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారిం చారు. వీరందరికీ కండ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. అయితే, వీరిలో ఇప్పటికీ 8.42 లక్షల మందికి అద్దాలు అందజేయలేదు.దీంతో చూపు మరింత మందగిస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తనకు సైట్‌ ఉందని గుర్తించిన 3 నెలల తర్వాత అద్దాలు ఇచ్చారని, దీంతో సైట్పెరిగి అద్దాలు పనికి రాకుండా పోయాయని నల్గొండకు చెందిన శ్రీకాంత్ అన్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రికివెళ్లాల్సి వచ్చిందని చెప్పా రు. అద్దాల పంపి ణీలోనూ అలసత్వమే జరిగిందని, సైజ్‌ లో తేడాతో, అద్దాలుఇచ్చినా నిరూపయోగమవుతున్నాయన్న ఆరోపణలుకూడా ఉన్నాయి.

Latest Updates