మన యుద్ధ విమానం కూలలేదు: పాక్ వి అబద్ధాలు

  • రక్షణ శాఖ వర్గాలు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామంటూ పాక్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. భారత వాయుసేన  యుద్ధ విమానాలేవీ కూలలేదని తెలిపాయి.

బుధవారం ఉదయం భారత యుద్ధ విమానాలను కూల్చామని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. పాక్ గగనతలంలోకి వచ్చే ప్రయత్నం చేయడంతో వాటిపై దాడి చేశామని చెప్పారు. రెండింటిలో ఒకటి పీవోకేలో, మరొకటి భారత్ లో కూలాయని ట్వీట్ చేశారు. భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ ను కూడా అరెస్టు చేశామన్నారు. ఈ వాదనను భారత్ తిప్పికొట్టింది. పాక్ మైండ్ గేమ్ ఆడుతోందని, భారత్ కు చెందిన ఏ యుద్ధ విమానాలూ కూలలేదని స్పష్టం చేసింది.

మరోవైపు పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ – 16 యుద్ధ విమానాలు మూడు భారత గగనతలంలోకి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. కశ్మీర్ లోని నౌషెరా సెక్టార్ లో సామాన్య ప్రజలు, బలగాలు లక్ష్యంగా అటాక్ కు చేయబోయింది. అయితే భారత వాయుసేన వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. మూడింటిలో ఒక యుద్ధ విమానాన్ని సరిహద్దు దాటి అవతలికి వెళ్లే లోపే కూల్చేసింది.

Latest Updates