కాశ్మీర్​లో ఆంక్షలా?? మాకు తెల్వది!

ఆర్టీఐ దరఖాస్తుకు
కేంద్ర హోం శాఖ తెలివిగా రిప్లై

న్యూఢిల్లీ: కాశ్మీర్​వ్యాలీలో టెలికమ్యూనికేషన్​పై ఆంక్షలు విధించారో, లేదో తమకు తెలియదని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ చేసిన దరఖాస్తుకు కేంద్ర హోం మంత్రి అమిత్​షా సోమవారం సమాధానం ఇచ్చారు. ‘‘జమ్మూకాశ్మీర్​లో రాజకీయ నిర్బంధం, టెలికమ్యూనికేషన్​పై ఆంక్షలు, శాటిలైట్ సర్వీసుల తాత్కాలికంగా నిలిపివేత.. తదితర అంశాలపై హోం శాఖకు ఎలాంటి సమాచారం లేదు” అని బదులిచ్చారు.

‘‘జమ్మూకాశ్మీర్​కు చెందిన ఉత్తర్వులు ఏవైనా.. ఆ రాష్ర్ట ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటాయి. అక్టోబర్ 31 వరకు జమ్మూకాశ్మీర్​ఒక రాష్ర్టంగానే ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మనుగడలోకి వస్తుంది. దాని ప్రకారం.. ప్రస్తుతం కాశ్మీర్​ఒక రాష్ర్టం కాబట్టి అక్కడ ఆర్టీఐ పని చేయదు” అని దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చారు.

Latest Updates