రెండు వేల నోటు రద్దు చేసే ఆలోచన లేదు: నిర్మలా సీతారామన్

రెండు వేల రూపాయల నోటు రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా త్వరలో రూ. 2వేల నోటు రద్దు కానుందన్న వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశమైన నిర్మలా సీతారామన్‌ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదంటూ తాజా పుకార్లను  కొట్టి పారేశారు. 2 వేల రూపాయల  విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని  నిర్మలా సీతారామన్‌ సూచించారు.

No instructions to banks to phase out Rs 2,000 notes, says Finance Minister Nirmala Sitharaman

Latest Updates