జీన్స్, టీ షర్టులతో పార్లమెంటుకు వస్తే నో ఎంట్రీ

జీన్స్, టీ షర్టులతో పార్లమెంటుకు వస్తే నో ఎంట్రీ
  • బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులకు డ్రెస్‌ కోడ్‌

లండన్: బ్రిటన్ పార్లమెంటు సభ్యుల్లో జవాబుదారీతనం, హుందాతనం పెంపొందించడంలో భాగంగా  బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులకు డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించారు. డ్రెస్‌కోడ్‌ లేకపోవడంతో సభ్యులు ఇష్టానుసారం డ్రెస్సులు వేసుకుని వచ్చేవారు. ఎంపీల డ్రస్సులపై మునుపటి స్పీకర్ లెవరూ పట్టించుకునేవారు కాదు. కానీ  ప్రస్తుత కామన్స్‌ స్పీకర్‌ సర్‌ లిండ్సే హోలే మాత్రం ఎంపీల డ్రస్సులపై దృష్టి సారించడం కాదు.. జీన్స్ , స్లీవ్ లెస్ చెల్లదంటూ హుకుం జారీ చేశారు.  

బిజినెస్‌ సూట్‌ ఎలా ఉండాలో మార్గదర్శకాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు సభా గౌరవ మర్యాదలు ప్రతిబింబించేలా సభ్యుల ప్రవర్తన, డ్రెస్‌ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై సభ్యులు జీన్స్‌, చినోస్‌,స్పోర్ట్స్‌వేర్‌, కాజువల్‌ వేర్‌తో సభకు రావొద్దని ఆయన స్పష్టం చేశారు. టీ షర్ట్‌, స్లీవ్‌లెస్‌ టాప్స్ కూడా అధికారిక వస్త్రధారణ కాదని ఆయన తెలిపారు. పార్లమెంటు సభ్యులు స్మార్ట్‌, బిజినెస్‌ షూస్‌ వేసుకోవాలని... కాజువల్‌ షూస్‌ వేసుకుని రావొద్దని సూచిస్తూ..  టై, జాకెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు.