మావోయిస్టులు పాల్గొనలేదు..సీపీ చెప్పేవన్నీ అబద్ధాలే: చాడ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌‌బండ్‌‌లో మావోయిస్టు సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారని హైదరాబాద్‌‌ సీపీ అంజనీ కుమార్‌‌ ప్రకటించారని, ఇది పచ్చి అబద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌‌ రెడ్డి అన్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా, ఆర్టీసీ కార్మికులపై, లెఫ్ట్‌‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేసి గాయపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Latest Updates