ఎంత ఖరీదైన మందులైనా వాడి నాగులును బతికిస్తాం

-వైద్యఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్ రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగులును వైద్య ఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్ రెడ్డి పరామర్శించారు. నాగులును బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అవసరమైతే ఎంత ఖరీదైన మందులైనా తెప్పించి వినియోగించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నాగులును బతికించడం కోసం ఉస్మానియా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించి.. 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పడికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ.. చికిత్స చేస్తున్నారు.

 

Latest Updates